- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘పవన్ కల్యాణ్ వీరాభిమాని’’
తాను పవన్‌కళ్యాణ్ వీరాభినని యంగ్ యాక్టర్ నితిన్ చాలా సార్లు చెప్పాడు, నిరూపించుకున్నారు కూడా. ఇటీవల నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘భీష్మ’. రష్మిక మందన్నా కథానాయిక. ‘ఛలో’ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రష్మిక మీడియాతో ముచ్చటించారు. హీరో నితిన్ యాక్టర్ అయినా కూడా ఇంకా పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గానే ఉండటం నాకెంతో ముచ్చటగా అనిపించింది అని రష్మిక తెలిపింది. నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘‘మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్‌గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్‌గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్‌గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. ‘పవన్‌గారిని ఎప్పుడైనా కలిశారా?’ అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్‌గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్..’’ అని రష్మిక చెప్పుకొచ్చారు.