- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం విడిపోయినా.. ప్రేమ బతికింది!
దిశ, ఫీచర్స్ : నిజమైన ప్రేమకే కాలం పరీక్ష పెడుతుంది.. ఒక్కటవ్వాలనుకున్న జంటకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుంది. చరిత్రలో నిలిచిన ప్రేమ కథలు వింటే ఈ మాటలు నిజమే అనిపిస్తుంది. కానీ అదే ప్రేమ.. గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఏదో ఒక మార్గాన్ని కూడా చూపిస్తుంది. తాజాగా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి అలాంటి లవ్ స్టోరీనే పంచుకుంది. దేశ విభజన కారణంగా విడిపోయి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఓ జంట.. తమ ప్రేమను ఎలా గెలిపించుకుందో తెలిపింది.
ప్రస్తుతం తొంభైఏళ్ల వయసున్న ముసలావిడ.. తన స్టోరీని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్ చేసింది. 16 ఏళ్ల వయసులో తనకు ఎంగేజ్‌మెంట్ అయిందని, అప్పుడు తనకు కాబోయే భర్త ఫొటో మాత్రమే చూశానని చెప్పింది. అయితే నిశ్చితార్థం జరిగిన 6 నెలల్లోనే ఇండియా-పాకిస్థాన్ దేశాల విభజన జరగడంతో తన ఫ్యామిలీ మొత్తం సింధ్ నుంచి అమృత్‌సర్‌కు రావాల్సి వచ్చిందని తెలిపింది. కానీ తన మనసు మాత్రం ఎప్పుడూ కాబోయేవాడి చుట్టే తిరిగేదని, తన క్షేమాన్నే తలచుకుంటూ, అతడిని చూడగలనా? లేదా? అని ఆందోళన పడేదాన్నని వివరించింది. ఇదిలా ఉంటే.. అవతలి వైపు అదే పరిస్థితి. ఆమెకు కాబోయేవాడు తనకోసం దాదాపు 90 రోజుల పాటు ఒక్కో క్యాంపు వెతుక్కుంటూ వచ్చాడు. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత తన అడ్రస్ కనుక్కోగలిగాడని వీడియోలో పేర్కొన్న ఓల్డ్ లేడీ.. ‘అతడు వస్తాడని నాకు తెలుసు’ అంటూ వివరించింది.
దేశ విభజన జరిగిన ఏడాది తర్వాత వివాహం చేసుకున్న ఈ జంటకు ఎనిమిది మంది పిల్లలు పుట్టారు. ఇక ఆమె భర్త 30 ఏళ్ల కిందటే మరణించినా ఇప్పటికీ అతనిపై ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు. కాగా తన జీవితంలో జరిగిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని చెప్పిన ఆ ముసలావిడ.. ‘అతడు నన్ను వెతికిపట్టుకున్నందుకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని, మేమిద్దరం కలిసి అందమైన జీవితాన్ని నిర్మించుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ జంట ‘స్వచ్ఛమైన’ ప్రేమ కథను చూసి చలించిపోయామని చెబుతున్నారు. ఇది ఒక రకమైన భావోద్వేగమని, వారి ప్రేమ కథ ‘స్వర్గంలో రూపొందించబడింది’ అని కామెంట్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CSlUd1jKfnT/?utm_source=ig_embed&ig_rid=2d589547-89e8-4816-bb2e-043d573c6951