ధోనీతో కలసి ఆడటం నా అదృష్టం: పార్దీవ్ పటేల్

by Shyam |
ధోనీతో కలసి ఆడటం నా అదృష్టం: పార్దీవ్ పటేల్
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాలో మాజీ క్రికెటర్ ధోనీతో కలసి ఆడటం తన అదృష్టమని పార్దీవ్ పటేల్ అన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ అయిన పార్దీవ్ పటేల్ టీమ్ ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. కాగా, ధోనీ కారణంగానే పార్దీవ్‌కు సరైన అవకాశాలు రాలేదని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో అతడు స్పందించాడు.

‘ధోనీతో కలసి క్రికెట్ ఆడటం తన అదృష్టం. నేను 2002లో అరంగేట్రం చేశాను. 19 టెస్టుల పాటు ఆడాను. అయితే మహీ వచ్చాక నాకు అవకాశాలు రాకపోవడానికి అతడు కారణం కాదు. కేవలం నా ప్రదర్శన బాగా లేకపోవడం వల్లే జట్టులో స్థానం దక్కలేదని భావిస్తున్నాను. నేను రాణించని సమయంలో ధోనీ అందుబాటులో ఉండటంతో అతడికి అవకాశాలు వచ్చాయి.’ అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాక పార్దీవ్ పటేల్‌తో పాటు దినేశ్ కార్తీక్‌కు కూడా ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఐపీఎల్‌లో ఆడినా చివరకు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కోసం పని చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed