- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్ హబ్‌గా పరిగి.. భారీగా విద్యుత్ ఉత్పత్తి
దిశ, పరిగి: ప్రస్తుతం మానవుడి మనుగడ పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడి ఉంది. ఉదయం లేచింది మొదలు తాగే ప్యూరిఫైర్ నీటి నుంచి రాత్రి నిద్రించే ముందు వాడే గుడ్‌నైట్ రీఫిల్ వరకు అంతా విద్యుత్ ఆధారితమే. కరెంటు లేనిదే మానవుడి మనుగడ లేదనే స్థాయికి అలవాటు పడ్డాం. అలాంటి పవర్తయారీకి పరిగి కేంద్ర బిందువుగా మారింది. పవర్ హబ్‌గా నిలిచింది. పరిగిలో మొదట కాళ్లాపూర్ లొంక ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో సోలార్ ప్లాంటు ఏర్పాటైంది. ఆ తర్వాత నస్కల్, బర్కత్‌పల్లి, పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎత్తైన ప్రాంతం ఉండటం, గాలి ఎక్కువగా వీస్తుండటం చూసి విండ్ పవర్ ప్లాంటు వారి దృష్టి పరిగిపై పడింది. డివిజన్ పరిధిలోని కెరవెళ్లి, సిరిగాయపల్లి, మాదారం, రాపోల్, చిట్యాల తొండపల్లి, సయ్యద్‌పల్లి తదితర గ్రామాల్లో మొత్తం 48 విండ్ టర్బైన్లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి మొత్తం 45 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
పరిగి టు ధర్మసాగర్‌కు సప్లయ్
పరిగి పట్టణంలో 33/11 కేవీ, 132/33 కేవీ, 230/132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిగి, రంగంపల్లి, రాపోల్ గ్రామాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. పరిగి పట్టణం, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. వీటితోపాటు రాకంచర్ల ఇండస్ర్టీతోపాటు అభిరామ స్టీల్, సావిత్రి స్టీల్, సుగుణ మెటల్ పవర్ ప్లాంటు, కొందుర్గు మండలం లాల్‌పహాడ్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీ, కొందుర్గు సమీపంలోని దివ్యశక్తి పేపర్ మిల్లు, సోమన్గుర్తి జిన్నింగ్ మిల్లు తదితర ఇండస్ర్టీలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇటీవలే కొత్తగా పరిగి నుంచి ధర్మసాగర్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.