పరీక్షలు నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారు

by Shamantha N |
పరీక్షలు నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారు
X

న్యూఢిల్లీ: జేఈఈ, నీట్‌లను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాత్రం విద్యార్థులు, వారి పేరెంట్స్, సంరక్షకులే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రెండుసార్లు వాయిదా వేసిన తర్వాతే తాజా షెడ్యూల్ ఖరారైందని, సుప్రీంకోర్టూ సెప్టెంబర్‌లోనే పరీక్షల నిర్వహణకు ఆదేశించిందని గుర్తుచేశారు. కాగా, 85శాతం మంది జేఈఈ అభ్యర్థులు ఇప్పటికే అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. జేఈఈ కోసం నమోదుచేసుకున్న మొత్తం 8.85 లక్షల విద్యార్థుల్లో 7.25లక్షల మంది ఇప్పటికే అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed