గోత్రం లోపలే పెళ్లి చేసుకున్నదని తల్లిదండ్రులే.. దారుణం

by Sumithra |   ( Updated:2020-02-22 08:30:59.0  )
గోత్రం లోపలే పెళ్లి చేసుకున్నదని తల్లిదండ్రులే.. దారుణం
X

మతాంతర వివాహం చేసుకున్నారని, వేరే కులానికి చెందినవారిని పెళ్లి చేసుకున్నారని దంపతులపై దాడులు జరగడం చూశాం. హత్యలూ జరిగాయి. కానీ, మతం, కులాన్ని దాటి మరో అడుగు వెనక్కేసి గోత్రం కారణంగా సొంత కూతురినే హతమార్చిన ఘటన ఢిల్లీలో జరిగింది. కూతురు సొంత గోత్రానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఆమెను చంపేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన శీతల్ చౌదరీ, అంకిత్ భాటియాలు మూడేళ్ల క్రితం నుంచి సన్నిహితంగా ఉండి.. గతేడాది అక్టోబర్‌లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ, ఎవరి కుటుంబంతో వారే ఉన్నారు (చౌదరీ, భాటియా కుటుంబాలు ఇరుగుపొరుగునే ఉంటూ డెయిరీ వ్యాపారం నిర్వహిస్తున్నాయి). శీతల్ చౌదరీ వారి పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు రవీందర్ చౌదరి, సుమన్ చౌదరీలకు, బంధువులకు జనవరి 30న వెల్లడించింది. శీతల్ చౌదరి, అంకిత్ భాటియాలది ఒకే గోత్రమని కుటుంబీకులు పెళ్లి విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే ఆగ్రహంతో ఆమె గొంతునులిమి చంపేసినట్టు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. శీతల్ చౌదరి కనిపించడం లేదని ఆమె భర్త అంకిత్ భాటియా ఫిబ్రవరి 17 పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శీతల్‌ను చంపేసి ఆమె మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని సికంద్రాబాద్ వరకు కారులో తీసుకెళ్లి ఓ కెనాల్‌లో వదిలిపెట్టినట్టు తెలిసింది.

ఫసల్ బీమా.. ఏదీ పైసల్ ధీమా?

Advertisement

Next Story