ఆ పెళ్లి కూతురు ఒంటి నిండా పానీ పూరీ

by Shyam |   ( Updated:2023-10-12 06:11:17.0  )
ఆ పెళ్లి కూతురు ఒంటి నిండా పానీ పూరీ
X

దిశ, వెబ్‌డెస్క్ : అమ్మాయిలకు జ్యూవెల్లరీ అంటే చాలా ఇష్టం. ఇక తన పెళ్లి అంటే.. ఇక చెప్పాల్సిన అవసరమే లేదు వారి షాపింగ్ గురించి. అయితే ఓ అమ్మాయి తన పెళ్లిని తనకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ పానీపూరీతో జరుపుకుంది. పానీ పూరీతో పెళ్లి ఏంటీ.. పెళ్లి భోజనాలలో పానీ పూరీ పెట్టారా ఏంటీ అని ఆలోచిస్తే పప్పులో కాలు వేసినట్టే. పానీ పూరీతో పెళ్లి ఏంటీ ? అనేగా మీ ఆలోచన. అమ్మాయిలకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌లో ముందు ఉండేది పానీ పూరీ. పానీ పూరీ అంటే చాలు అమ్మాయిలు లొట్టలేసుకొని తింటారు. అయితే ఓ అమ్మాయి తనకు పానీ పూరీ మీద ఉన్న ప్రేమను తెలపడానికి తన పెళ్లిలో పానీ పూరీనే నగలుగా ధరించింది. ఏ పెళ్లి కూతురైన ఒంటి నిండ నగలతో మెరిసి పోతే ఈ అమ్మాయి మాత్రం కొంచెం కొత్తగా ఒంటి నిండా పానీ పూరీతో మెరిసిపోయింది. ఈ వెరైటీ పానీపూరీ నగలతో ఉన్న నవ వధువును బంధువులు సరదాగా ఆటపట్టిస్తోంటే సిగ్గుతో ఆమె చిరునవ్వులు చిందించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈవీడియోనీ బ్రైడల్‌ మేకప్‌ సంస్థ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story