ఈ పథకాలు దేశానికే ఆదర్శం : కందాళ

by Sridhar Babu |   ( Updated:2020-08-27 11:41:21.0  )
ఈ పథకాలు దేశానికే ఆదర్శం : కందాళ
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మండలంలోని రాజేశ్వరపురం, మండ్రాజుపల్లి, గ్రామాల్లో తన సొంత ఖర్చులతో కరోనా మహామ్మారి సోకకుండా రోగ నిరోధక శక్తిని పెంచే హోమియోపతి మందులను పంపిణీ చేశారు. అనంతరం పైనంపల్లి గ్రామంలో రైతులకు వ్యవసాయ రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పాసు పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసే ఎకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిశాయన్నారు.

Advertisement

Next Story