Breaking: బెజవాడ పోలీస్ కమిషనర్‌గా పాల రాజు

by Anukaran |   ( Updated:2021-11-29 12:00:30.0  )
Pala Raju
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు కొత్త బాస్‌‌గా పాల రాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ బత్తిన శ్రీనివాసులు పదవీ విరమణ పొందడంతో ప్రభుత్వం పాల రాజుకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో టెక్నికల్ వింగ్ చీఫ్‌గా పాల రాజు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం బెజవాడ సీపీగా పాల రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో విజయవాడలో డీసీపీగా ఆయన విధులు నిర్వహించారు. కాగా, నేరాలకు అడ్డాగా మారిన బెజవాడలో క్రైమ్ రేట్‌ తగ్గేలా పనిచేయాలని రాజును పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story