ఫియాన్సీపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?

by Jakkula Samataha |
ఫియాన్సీపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?
X

దిశ, సినిమా: పాకిస్థాన్ బిగ్ సెలబ్రిటీ, ఇర్ఫాన్ ఖాన్ ‘హిందీ మీడియం’ కోస్టార్ సబా కమర్ సోషల్ మీడియాలో ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. తన ఫియాన్సీ..బ్లాగర్, బిజినెస్‌మెన్ అజీమ్ ఖాన్‌తో మ్యారేజ్ ప్లాన్స్ విరమించుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘ హాయ్ ఎవ్రీ వన్.. పర్సనల్ రీజన్స్‌తో అజీమ్ ఖాన్‌తో రిలేషన్ కంటిన్యూ చేయదలుచుకోలేదు.. మేము ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. మీరందరూ ఎప్పటిలాగే నా నిర్ణయానికి మద్దతిస్తారని అనుకుంటున్నా. చేదు నిజాలను తెలుసుకుని రియలైజ్ అయ్యేందుకు ఆలస్యం కాలేదనే అనుకుంటున్నాను. మరో విషయం క్లియర్ చేయాలనుకుంటున్నా. నా జీవితంలో నేను ఎప్పుడూ అజీమ్ ఖాన్‌ను మీట్ కాలేదు. కేవలం ఫోన్‌ ద్వారా మాత్రమే కనెక్ట్ అయ్యాము. ఇది నాకు చాలా హార్డ్ టైమ్.. కానీ దేవుడి దయతో ఇది కూడా పాస్ అవుతుంది’ అంటూ పోస్ట్ పెట్టింది. కాగా గతంలో సబా కమర్, అజీమ్ ఖాన్‌కు పెళ్లి అని ప్రకటించన రోజునే.. ఓ మహిళ అజీమ్ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినా..ఈ విషయాన్ని బేస్ చేసుకునే సబా మ్యారేజ్ బ్రేకప్ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story