- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెర్రర్ ఫండింగ్ జాబితాలోనే పాక్
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(Financial Action Task Force) గ్రే లిస్టులోనే పాకిస్తాన్ కొనసాగనుంది. ఉగ్రవాదానికి ఆర్థికనిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎఫ్ఏటీఎఫ్ సూచించిన 27 అంశాల్లో ఆరింటిని నెరవేర్చడంలో విఫలమైందని ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. ఉగ్రవాదానికి నిధులు చేరకుండా అడ్డుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని, అందులో ప్రమేయమున్నవారిని గుర్తించి విచారించాలని, ఆంక్షలు విధించాలని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లెయెర్ అన్నారు.
పారిస్‌కు చెందిన ఎఫ్ఏటీఎఫ్ 2018లో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో చేర్చి 27 అంశాలతో కార్యచరణ ప్రణాళికను సూచించింది. నాలుగు నెలల గడువునిచ్చింది. కరోనా కారణంగా పొడిగించిన గడువూ ముగిసిన నేపథ్యంలో పాకిస్తాన్ కేవలం 21 అంశాలనే నెరవేర్చిందని ఏజెన్సీ తాజాగా తేల్చింది. పాకిస్తాన్ గ్రే లిస్టులోనే కొనసాగనున్నప్పటికీ ప్రస్తుతానికైతే బ్లాక్ లిస్టు నుంచి తప్పించుకుంది.