పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా

by vinod kumar |   ( Updated:2020-06-13 04:59:32.0  )
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కరోనా వైరస్ బారిన పడ్డాడు. శనివారం తన ట్విట్టర్ అకౌంట్లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘గురువారం నుంచి ఒంట్లో నలతగా ఉంది. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అయితే, దురదృష్టవశాత్తు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మీరందరూ ఇండ్లలోనే భద్రంగా ఉండండి’ అని ఆయన ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం అఫ్రిది ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. పాకిస్తాన్ క్రికెటర్లలో తౌఫిక్ ఉమర్, జఫార్ సర్ఫరాజ్‌లు తొలుత కరోనా బారిన పడి 14రోజుల ఐసొలేషన్ తర్వాత కోలుకున్నారు. తాజాగా అఫ్రిది కరోనా బారిన పడ్డారు. కాగా, కరోనా వైరస్ పాకిస్తాన్‌లో ప్రబలుతున్నప్పటి నుంచి అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం అందించాడు.

Advertisement

Next Story

Most Viewed