- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా చిన్నారుల పెయింటింగ్స్!
దిశ, ఫీచర్స్ : అనేక వర్ణాలను తనలో నింపుకుని, మరెన్నో భావాలకు ప్రాణం పోసే ‘పెయింటింగ్స్’ అంటే అందరికీ ఇష్టమే. వాటిని చూస్తుంటేనే తెలియని ఆనందం మనసులో ఉప్పొంగుతుంది. వాటితో మనకేదో బంధమున్నట్లు తోస్తుంది. అశాంతిని తరిమేసి, ప్రశాంతతను మోసుకొచ్చే పెయింటింగ్స్‌ను ఆస్పత్రి వార్డుల్లో ఉంచడం వల్ల రోగుల ఆరోగ్యస్థితి కూడా త్వరగా మెరుగుపడే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన డ్రాయింగ్ టీచర్ కమలా రవికుమార్ చిన్నారులతో ఓ ఆర్ట్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని పీడియాట్రిక్ వార్డు కోసం సదరు చిన్నారులు పెయింటింగ్స్ రూపొందించారు.
చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని పీడియాట్రిక్ వార్డుకు పెయింటింగ్స్ విరాళంగా ఇవ్వాలని డ్రాయింగ్ టీచర్ కమల నిర్ణయం తీసుకుంది. ఇండియా వైడ్‌గా ఉన్న ఆమె విద్యార్థులు అందుకు మద్దతిచ్చారు. 13 మందికి పైగా విద్యార్థులు తమ పెయింటింగ్స్‌లో ఒకదానిని ఆస్పత్రికి ఇచ్చేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పోస్టర్ రంగులతో(టెంపెరా స్టైల్) కాగితంపై వేసిన పదకొండు పెయింటింగ్స్‌ను ఏడు నుంచి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులు అందించగా.. మరో రెండు క్రేయాన్ పెయింటింగ్స్‌ను ఐదేళ్లలోపు చిన్నారులు అందించారు.
‘పిల్లలు ఏం చిత్రించాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వడంతో వారు తమ థీమ్స్ నాకు మెయిల్ చేశారు. కొన్ని సూచనలు ఇవ్వడంతో అందమైన పెయింటింగ్స్ అందించారు. ఫ్రేమింగ్ ఖర్చులను అడయార్‌లోని మూడు ఇన్నర్ వీల్ క్లబ్స్ భరించాయి. ఈ పెయింటింగ్స్.. పేషెంట్స్‌లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ఆ పిల్లలు అనుభవించే బాధను కొంతమేర తగ్గించగలవని ఆశిస్తున్నాను. 2004 నుంచి పిల్లలకు, పెద్దలకు ఈ కళను బోధిస్తుండగా.. ఆర్ట్ ద్వారా కొందరి సంతోషంలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’.
– కమల, డ్రాయింగ్ టీచర్