అన్నదాతను ఆగంజేసిన అకాల వర్షం.. వరదల్లో వరి ధాన్యం

by Shyam |
అన్నదాతను ఆగంజేసిన అకాల వర్షం.. వరదల్లో వరి ధాన్యం
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కామారెడ్డి పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వర్షం రాదేమో అనుకుని కొంతమంది రైతులు ధాన్యం సంచులలో నింపి టార్పాలిన్ కవర్లు కప్పడం మర్చిపోయారు. అనూహ్యంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోవడంతో పాటు వర్షంలో ధాన్యం కొట్టుకుపోయింది. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాత చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు. అయినా పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఓ వైపు ప్రభుత్వం వరి ధాన్యం పండించవద్దని చెప్తుండటం.. మరోవైపు చేతికొచ్చిన పంట ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందో లేదో తెలియక తలలు పట్టుకుంటున్న అన్నదాతలకు అకాల వర్షాలు తీరని శోకాన్ని మిగిల్చాయి.

Advertisement

Next Story

Most Viewed