గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌కు బయల్దేరిన ఆక్సిజన్ రైలు

by Shyam |
oxgen train
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సమయంలో ప్రాణవాయువు కొరతతో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఆక్సిజన్ అందించేందుకు సిద్ధమైంది. ఒడిశాలోని అంగూల్ ప్రాంతం నుంచి సికింద్రాబాద్‎కు మొదటి ఆక్సిజన్ రైలు బయలుదేరింది. ఐదు ట్యాంకర్లలో 63.6 టన్నుల ప్రాణవాయువును ఈ రైలు ఎక్స్ ప్రెస్ ద్వారా తరలిస్తున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మిలిటరీ సైడింగ్‌ నుంచి ఏప్రిల్‌ 28న ఈ ఐదు ఖాళీ ట్యాంకర్లతో ఈ రైలు అంగూల్‌కు తరలింది. క్రయోజనిక్‌ కార్గో అయిన ఈ ట్యాంకర్లలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ రవాణాకు అనేక పరిమితులుంటాయని దక్షిణ మధ్య రైల్వే పీఆర్ వో సీహెచ్ రాకేశ్ పేర్కొన్నారు. రవాణాలో సమయంలో గరిష్ట వేగం, ఒత్తడి వంటి అంశాలుంటాయని ఆయన చెప్పారు. క్లిష్ట సమయంలో దేశంలోని పలు ప్రాంతాకు ఆక్సిజన్‌ను సురక్షితంగా రవాణా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే శాఖ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ లను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఆక్సిజన్ తెచ్చేందుకు నాలుగు ఖాళీ ట్యాంకర్లతో మరో రైలును కూడా పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య కూడా ప్రజా అవసరాల నేపథ్యంలో మరిన్న రైళ్లు నడిపి ఆక్సిజన్ అందించేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed