- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాదే రెగ్యులేటర్స్ ముందుకు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University) ఆస్ట్రాజెనెకా(Astrogenica) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా(Vaccine) ఈ ఏడాదే రెగ్యులేటర్ల ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. అందుకు సరిపడా డేటా(Data)ను శాస్త్రజ్ఞులు(Scientists) సమకూరిస్తే ఇది సాధ్యమవుతుందని ఆక్స్‌ఫర్డ్ టీకా బృందం డైరెక్టర్ ఆండ్రూ పొలార్డ్(Andrew Pollard)వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్(Clinical trials) అనుకున్నట్టు సవ్యంగా సాగితే ఈ ఏడాదిలోనే రెగ్యులేటర్(Regulator) ముందుకు అనుమతి కోసం వచ్చే అవకాశం ఉందని, తదనంతరం ఆ డేటా మొత్తాన్ని సమీక్షించే ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రపంచమంతా ఆతృతగా ఎదురు చూస్తున్నా టీకా తొలిదశ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీకా కోసం ఫాస్ట్ ట్రాక్(Fast track) పద్ధతి అవలంబించడానికి ట్రంప్ ప్రభుత్వం(Trump government) యోచిస్తున్నదని ఇటీవల కథనాలు వెలువడటం గమనార్హం.