- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విసుగు తెప్పించిన ‘ఐసీడీఎస్’ అధికారులు.. యజమాని ఏం చేశాడంటే..?
దిశ, కోరుట్ల : కిరాయి అగ్రిమెంట్ కాలం ముగిసినా భవనం ఖాళీ చేయకపోవడంతో విసుగు చెందిన ఇంటి యజమాని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి తాళం వేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. మెట్‌పల్లి పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో నడికుడి సాయన్నకు చెందిన భవనంలో గత పదేండ్ల కిందట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం కోసం అధికారులు నెలకు రూ.7ఏడు వేల చొప్పున చెల్లిస్తామని భవనాన్ని అద్దెకు తీసుకున్నారు.
కాగా, గత రెండేళ్ల కిందట కార్యాలయం అగ్రిమెంట్ ముగియడంతో యజమాని అద్దెకు సంబంధించి కిరాయి పెంచుతామని పేర్కొనగా సంబంధిత అధికారులు కిరాయి అంత ఇచ్చుకోలేమని, త్వరలోనే భవనం ఖాళీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. అగ్రిమెంట్ ముగిసి రెండేళ్లు గడుస్తుందని, ఎప్పుడు ఖాళీ చేయమని అడిగిన ఇప్పుడు, అప్పుడు అంటూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. అధికారుల తీరుతో విసుగు చెంది కార్యాలయానికి తాళం వేసినట్టు యజమాని సాయన్న పేర్కొన్నారు. భవనం అద్దెకు సంబంధించి కిరాయి తాము అనుకున్నట్టు ఇస్తూ అగ్రిమెంట్ చేస్తే తాను తాళం తీస్తానని, లేదంటే వెంటనే కార్యాలయాన్ని తమ భవనం నుంచి ఖాళీ చేయాలని సాయన్న స్పష్టం చేశారు.