- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీరోన్ పొలార్డ్ చనిపోయాడా? ఇది నిజమా
దిశ,వెబ్‌డెస్క్: వెస్టిండీస్ క్రికెట్ కెప్టెన్ స్టార్ బ్యాట్స్‌మెన్ కీరోన్ పొలార్డ్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అబుదాబిలో టీ10లీగ్ ఆడుతున్న పొలార్డ్ ఓరోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులు తాము అభిమానించే క్రికెటర్ రోడ్డు ప్రమాదంలో మరణించడంపై విచారించారు.
అదే సమయంలో పొలార్డ్ గురువారం అబుదాబిలో జరిగిన టీ10లీగ్ మ్యాచ్‌లో పూణే డెవిల్స్- డెక్కన్ గ్లాడియేటర్స్ టీం మధ్య జరిగిన లీగ్ లో పాల్గొన్నారు. డెక్కెన్ గ్లాడియేటర్స్ టీం కెప్టెన్ గా ఉన్న పొలార్డ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో పూణే డెవిల్స్పై డెక్కన్ గ్లాడియేటర్స్ టీం 7వికెట్ల తేడాతో ఓడిపోయింది.
అయితే కీరోన్ పొలార్డ్ మరణంపై వెలుగులోకి వచ్చిన వీడియోల్ని చెక్ చేయగా అవి నకిలీ వీడియోలని తేలింది. గతంలో సురేష్ రైనా చనిపోయారంటూ కొన్ని నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు పొలార్డ్ వీడియోలు అలాగే వైరల్ అవుతున్నట్లు స్పష్టమైంది.