- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్లు తాగారు..70 వేలు మరిచారు..చివరికి ఏం జరిగిందంటే..?
దిశ ,గోపాల్పేట: మనిషిని మద్యం అతలకుతలం చేస్తుంది. దీనికి తోడు గ్రామాల్లో పౌడర్ కలిపిన కల్లు తాగి మనిషి సోయి లేకుండా తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియని విధంగా తయారవుతున్నారు. వివరాల్లోకి వెళితే..వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని తాడిపర్తి గ్రామానికి చెందిన రామస్వామి ఆయన భార్య ఇద్దరు కలిసి మండల కేంద్రంలోని ఓ కల్లు దుకాణంలో తాగారు. కల్లు తాగిన మత్తులో తమ వద్ద ఉన్న 70 వేల రూపాయలు నగదును అక్కడే మర్చిపోయి వెళ్లారు. కొంతసేపటి తర్వాత రామస్వామి దగ్గర డబ్బు కనిపించకపోవడంతో..పరుగు పరుగున కల్లు దుకాణం దగ్గరికి పోయి చూడగా అక్కడ కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కల్లు తాగిన మైకంలో డబ్బు పోగొట్టుకున్న ఆ దంపతులకు గోపాల్పేట పోలీస్ బృందం సీసీ కెమెరాలు ఆధారంగా పరిశీలించి. డబ్బు తీసుకున్న వారిని గుర్తించి వారి ద్వారా 70 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అప్పగించారు.
గోపాల్పేట ఎస్సై నరేష్ కుమార్ మాట్లాడుతూ..సీసీ కెమెరా ఆధారంగానే రామస్వామి కుటుంబానికి 70 వేల నగదును అప్పగించడం జరిగిందన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుతో సమానం కావున ప్రతి ఒక్కరూ మీ మీ షాపుల ముందు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సీసీ కెమెరాల ఉండడం వల్ల నేరలను అరికట్టవచ్చని ఆయన అన్నారు.