గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి  అరెస్ట్
X

దిశ,ఉప్పల్ : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ పోలీస్ సిబ్బందితో కలిసి ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఓంకార్ తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ కి చెందిన చవన్ సతీష్ ఆంధ్రా నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మల్లాపూర్ లో అవసరమైన వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎఎక్సైజ్ పోలీసులు దాడిచేసి నాచారం పెద్ద చెరువు దగ్గర పట్టుకున్నారు. అతడి వద్ద కేజీ 350 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దాడిలో ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ నరేష్ రెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed