- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోట్లు నొక్కేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. ఎలాగంటే..!
దిశ, నారాయణపేట : ఉన్నతాధికారుల అజమాయిషీ లేని ఎస్‌డీసీ (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) కార్యాలయంలో మూడున్నర కోట్ల స్వాహా చేసిన సంఘటనలోఅవుట్సోర్సింగ్ అటెండర్ కాడ్య నాయక్ మాగనూరు కు చెందిన పైరవి కారు అండతో ఎక్కువ మొత్తంలో డబ్బులను తన, తన భార్య, బంధువులు, స్నేహితుల పేరిట చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేయించినట్లు రెవెన్యూ శాఖ అధికార వర్గాలకు సమాచారం అందింది. కాగా ఇప్పటికే అవుట్సోర్సింగ్ అటెండర్ కాడ్య నాయక్ ను పోలీసులు విచారిస్తుండగా.. కాడ్యా నాయక్ మాత్రం తాను కేవలం నాలుగు చెక్కులే తీసుకున్నానని.. మిగతా ఎనిమిది చెక్కులను మాగనూరుకు చెందిన శంకరప్పకు ఇచ్చినట్లు ఇదివరకే రెవెన్యూ అధికారులకు, ప్రస్తుతం విచారణ చేస్తున్న పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది.
అయితే కాడ్యా నాయక్ నిజమే చెబుతున్నా డా..? అబద్ధం చెప్తున్నాడా అని పోలీసులు ఆ పన్నెండు చెక్కుల వివరాలను సేకరించినట్లు సమాచారం. అటెండర్ కాడ్యా నాయక్ పన్నెండు చెక్కులు కార్యాలయంలోని బీరువా నుంచి అపహరించాడని, ఆ చెక్కులను వేరువేరు వ్యక్తుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ పన్నెండు చెక్కుల డబ్బులే రూ.98 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా అందిన వివరాలను బట్టి ప్రస్తుత ఆర్డీఓ వెంకటేశ్వర్లు లెక్క కట్టినట్లు సమాచారం. ఒకవేళ పోలీసుల విచారణ అనంతరం ఇదే వాస్తవమని తేలితే అవుట్సోర్సింగ్ అటెండరే కోటికి పడగెత్తడానికి దరిదాపునకు వచ్చినట్లు అవుతుంది.
ఇదేందప్ప .. శంకరప్ప..!!
ఎస్‌డీసీ కార్యాలయంలో మూడు నుండి మూడున్నర కోట్ల డబ్బులు స్వాహా అయిన సంఘటనలో మరో కీలక సూత్రధారి శంకరప్ప. మాగనూరు మండలానికి చెందిన శంకరప్ప పెద్ద పైరవి కారుడు. ప్రస్తుతం శంకరప్పను మక్తల్ పోలీస్ స్టేషన్‌లో నారాయణపేట పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. మొదటి నుంచీ ఈ వ్యవహారంలో ఇతడే ముఖ్య భూమిక పోషించినట్లు పేర్కొంటూ పాత, కొత్త ఆర్డీవోలు ఇచ్చిన ఫిర్యాదులో రాయడంతో నారాయణపేట పోలీసులు సైతం ఈ సంఘటనలో ఏ1 గా నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అటెండర్, పైరవి కారుడు, ఓ వీఆర్‌వోతో పాటు.. ఇంకా కార్యాలయంలో ఎవరెవరి ద్వారా ఎన్ని చెక్కులు బయటికి వెళ్లాయని పోలీసులు సుదీర్ఘ విచారణ చేస్తున్నారు. అయితే మూడు రోజులుగా విచారణ కొనసాగుతున్నా ఇంకా పోలీసులకు ఓ స్పష్టత రాలేదని సమాచారం.
ఆర్డీవోకు స్వల్ప అస్వస్థత
నారాయణపేట ఆర్డీవో, ఎస్‌డీసీ ఇంచార్జీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు స్వల్ప అస్వస్థత బాధపడుతున్నారు. ఎస్‌డీసీ కార్యాలయంలో జరిగిన ఈ డబ్బులు తతంగంపై గత వారం రోజుల నుంచి పగలు, రాత్రి రికార్డులు, బ్యాంకు స్టేట్మెంట్ లను శాఖాపరమైన దస్తాలను విశ్రాంతి లేకుండా పరిశీలిస్తూ ఉండడంతో కొంత అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆర్డీవో డ్రైవర్ (అవుట్ సోర్సింగ్) కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆర్డీవో వెంకటేశ్వర్లు సైతం కరోనా టెస్ట్ చేయించుకుని చేయించుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.