- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నార్తులకు అండగా మేముంటాం
దిశ, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా కారణంగా ఎవరి దారి వారిదే… ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. కానీ, ఇలాంటి సమయంలో వారు ముందడుగు వేశారు. ఎవరూ లేని వారికి అండగా నిలబడి వారి ఆకలిని తీర్చారు. అదేంటో మీరే చూడండి..
దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. సకల వర్గాల జనులంతా వారి ఉద్యోగ విధులకు దూరంగా, ఇళ్లకే పరిమితం కావాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో ఎంత పెద్ద ధనవంతులైనా.. కూర్చొని తింటే కొండలు కరిగిపోయినట్టుగా… ఎవరికి వారే తమ పరిస్థితులను చక్కదిద్దుకోవడం గగనంగా మారుతున్న క్రిటికల్ కండిషన్ ఉంది. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ మహానగరంలో సామాజిక సేవా ధృక్పథం కలిగిన మహానుభావులు ముందుకొచ్చి ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు మేము అండగా ఉంటామంటూ ముందుకొస్తున్నారు. వాస్తవానికి రోడ్లపై అనాథలుగా ఉంటున్న యాచకులు, బిచ్చగాళ్లను ప్రభుత్వం నైట్ షెల్టర్లలో చేర్చి వారికి కడుపు నిండా అన్నం పెడతామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. కానీ, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు మాత్రం నగరంలోని అనాథలను పట్టించుకోకపోవడం కారణంగా పాతరోజుల్లో లాగే.. వీరంతా ఆయా రోడ్లకు ఇరువైపులా ఫుట్ పాత్ లపై పడుకోవడం, ఎవరైనా మహానుభావులు వచ్చి నాలుగు మెతుకులు అన్నం తెచ్చి ఇస్తారేమోనని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అభాగ్యులను ఆదుకోవాలి..
నగరంలోని రోడ్లకిరువైపులా ఎక్కడ ఫుట్ పాత్ చూసినా.. యాచకులు, బిచ్చగాళ్ళు కన్పిస్తున్నారు. వారుండే చోటుకు ఏదైనా 5 రూపాయలు భోజన కేంద్రం వద్ద కడుపు నింపుకుంటున్నారు. లేదంటే, ఎవరైనా దయగల మారాజులు ఎవరైనా అన్నం పెడతారేమోనని ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితులు రాష్ట్ర శాసనసభకు సమీపంలోని బస్టాండు, అక్కడకు దగ్గరలోని పబ్లిక్ గార్డెన్ బస్టాపు, ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రధాన రహదారికి ఇరువైపులా, బాగ్ లింగంపల్లి ప్రధాన రహదారి, ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో ఫుట్ పాత్ లు, బస్టాండులలో ఉంటున్న వారిని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ షెల్టర్లకు తరలించడం లేదు. అసలే దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు లేకపోవడంతో వీరికి యాచించి కొంత ఆహారం సేకరించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల మధ్య భాగ్యనగరంలోని దిక్కులేని అనాథలు, అభాగ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
సామాజిక సేవా ధృక్పథంతో..
హైదరాబాద్ మహానగరంలో యాచకులు, అనాథలు, అభాగ్యులు ఎక్కవే. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న ఈ నేపథ్యంలో కొద్దిపాటి ఉద్యగులే విలవిలలాడుతున్నారు. ఆహారం కోసం ప్రతిరోజూ ఇతరులపై ఆధారపడే అనాథల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. అయితే, నగరంలోని పలు ప్రాంతాలకు యువకులు ఈ సమయంలో తమ సేవా ధృక్పథాన్ని చాటుకుంటున్నారు. వారి సొంత ఖర్చులతో ఆహారాన్ని తయారు చేయించుకుని వారుండే ప్రదేశాలకు వెళ్ళి మరీ.. ఆహారం, నీరు అందిస్తున్నారు. బాగ్ లింగంపల్లికి చెందిన నలుగురు యువకులు రాత్రి 7 గంటల నుంచి నగరంలోని పలు ఫుట్ పాత్ లపై ఆహారాన్ని అందిస్తున్నారు. ముషీరాబాద్ బీర్భాన్ గల్లీకి చెందిన స్థానిక యువత దాదాపు 10 టూవీలర్ వాహనాలపై ఫుట్ పాత్ లపై ఆహారాన్ని అందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసే ఓ యువకుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపుగా 350 మంది అనాథలకు ఆశ్రయం కల్పించాడు. వారికి కావాల్సిన ఆహారం, ఇతర సదుపాయాలు అందజేస్తున్నాడు. ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో యువకులు, ఇతర సామాజిక సంస్థలు అనాథలకు ఆకలి తీరుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ తమ సేవా ధృక్పథాన్ని చాటుతున్నారు.