రైతులు, చేతివృత్తుల వారు చితికిపోయారు !

by srinivas |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ పాలనలో రైతులు, పేదలు, చేతివృత్తుల వారు ఆర్థికంగా చితికిపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రజా రోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న 30 జిల్లాలో 5జిల్లాలు ఏపీలో ఉండటం ప్రభుత్వ వైఫల్యాన్ని వెల్లడిస్తుందన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేయడమే జగన్ ఏకైక మార్గమని విమర్శించారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం రాష్ట్రానికి తీరని లోటన్నారు.

Advertisement

Next Story