టీడీపీ వార్డు అభ్యర్థి భర్తపై గొడ్డలితో దాడి

by srinivas |
టీడీపీ వార్డు అభ్యర్థి భర్తపై గొడ్డలితో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 70 శాతం ఓటింగ్ పోలైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, పంచాయతీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజాగా.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేదాద్రిలో 7వ వార్డు టీడీపీ అభ్యర్థి సునీత భర్తపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. వెంటనే గమనించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తీవ్రగాయాలైన అభ్యర్థి భర్తను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story