కరోనాకు క్రికెట్ మ్యాచ్‌ను లింక్ చేసిన గంగూలీ

by Shyam |
కరోనాకు క్రికెట్ మ్యాచ్‌ను లింక్ చేసిన గంగూలీ
X

కోల్‌కతా: మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆటలోనే కాకుండా మాటల్లోనూ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆటపై ఎంత పట్టుందో క్రికెట్ పాలనలోనూ తనకు అంతే అనుబంధం ఉంది. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న సౌరవ్.. పలు విషయాలు పంచుకున్నారు. ‘ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా సంక్షోభాన్ని చూస్తుంటే ప్రమాదకరమైన పిచ్‌పై టెస్టు మ్యాచ్ ఆడుతున్నట్లు ఉందని’ క్రికెట్ భాషలో ఎనలైజ్ చేశాడు. ‘బంతి వేగంగా దూసుకొస్తోంది.. మెలికలు కూడా తిరుగుతోంది.. బ్యాట్స్‌మన్ ఎలాంటి చిన్న తప్పు చేసినా అవుట్ కావడం ఖాయం అనేవిధంగా పిచ్ ఉంది.. ఈ సమయంలో గెలవాలంటే బ్యాట్స్‌మన్‌ బంతిని సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు చేయాల్సిందే.. తన వికెట్ కాపాడుకోవాల్సిందే’ అని అన్నాడు. కరోనా కారణంగా సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తుంటే ఎంతో విచారం కలుగుతోందని.. కానీ అదేసమయంలో సమిష్టిగా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వైరస్‌ను ఎలా నిలువరించాలన్నదే మానవాళి ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్నని గంగూలీ అన్నాడు.

Tags: Cricket, Sourav Ganguly,Coronavirus , BCCI

Advertisement

Next Story

Most Viewed