భూ వివాదంలో యువకుడి హత్య

by Sridhar Babu |
భూ వివాదంలో యువకుడి హత్య
X

దిశ, సిరిసిల్ల: భూ వివాదం కారణంగా ఒకరిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైరగోని తిరుపతి (28)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో నెంబరు లేని ఓ పల్సర్ వాహనాన్ని వదిలేసి వెల్లడంతో పోలీసులు వాహనం ఆధారంగా విచారణ చేపట్టారు. మృతునికి నెల రోజుల క్రితమే ఓ పాప పుట్టినట్టు గ్రామస్థులు తెలిపారు.

Advertisement

Next Story