ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

by Shyam |
ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, కంటోన్మెంట్: గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని డైరీ ఫారం రోడ్డు సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని, గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో మృతదేహం చెట్టుకు వేలాడుతూ…

కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి 35 ఏండ్ల వయసు ఉంటుందని, మృతికి గల కారణాలు వెతుకుతున్నారు. అతను చనిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story