దళిత సర్పంచ్ పై హత్యాయత్నం

by Sumithra |   ( Updated:2023-10-21 22:03:40.0  )
దళిత సర్పంచ్ పై హత్యాయత్నం
X

దిశ వెబ్ డెస్క్: వరంగల్ రూరల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాదంపై పంచాయతీ నిర్వహిస్తున్న సమయంలో సర్పంచ్ పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. వివరాల్లోకెళితే…వర్దన్న పేటలో ఓ భూవివాదం నెలకొంది. ఈ విషయంలో పంచాయతీ నిర్వహించాలని కడారి గూడెం సర్పంచ్ సతీశ్‌ను వర్దన్న పేట ఎస్.ఐ కోరారు. కాగా పంచాయతీ జరుగుతుండగా సర్పంచ్ పై ఓ వర్గం దాడికి దిగింది. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పోలీసుల ముందే జరగడం గమనార్హం.

Advertisement

Next Story