ఒక అమ్మాయితో..

by  |
ఒక అమ్మాయితో..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గుడ్ మార్నింగ్ ఫేమ్ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డాక్టర్ వి.భట్ నిర్మాతలుగా ఓ సినిమా తెరకెక్కింది. దీని పేరు ‘ఒక అమ్మాయితో…’ ‘కోవిడ్ టైమ్ కహానీ’ అనేది ఉపశీర్షిక. కరోనా సమయంలో 45 రోజుల పాటు ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. దీనికి ఇటీవలే టాకీ పార్ట్ పూర్తయినట్లు దర్శక, నిర్మాతలు వెల్లడించారు.ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎవరికీ ఏమీ కాకుండా సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేయడం ఒక రికార్డ్‌గా మూవీ టీం చెబుతోంది. పూర్తి జాగ్రత్తలతో సినిమా నిర్మాణం పూర్తి చేశామని నిర్మాతలు చెప్పుకొచ్చారు.

తారాగణం: శీతల్ భట్ (తొలి పరిచయం), సూరజ్ పవన్(తొలి పరిచయం), శ్రీరాగ్, గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె. సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులున్నారు.

సాంకేతికవర్గం…

బ్యానర్: ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్

మూవీ టైటిల్: ఒక అమ్మాయితో…

నిర్మాతలు: గార్లపాటి రమేష్, Dr. V. భట్
సంగీతం: కన్ను సమీర్
సినిమాటోగ్రఫీ: తోట వి.రమణ
ఎడిటర్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: పి.ఎస్. వర్మ
కొరియోగ్రాఫర్: భాను
రచన, దర్శకత్వం: మురళి బోడపాటి


Next Story

Most Viewed