- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: ఆహా.. ఇది కదా జీవితం అంటే.. రిటైర్మెంట్ లైఫ్‌ను రోడ్ ట్రిప్‌తో ఆస్వాదిస్తున్న దంపతులు (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా రిటైర్మెంట్ వయసు వచ్చిన ఎవరైనా ఏం చేస్తారు.. కృష్ణా, రామా అంటూ ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటారు. మరికొందరు కూతరు, కొడుకు ఇళ్లకు వెళ్లి మనవళ్లు, మనువాళ్లతో ఆడుతూ.. కాలక్షేపం చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్ మారిందండోయ్. తాజాగా, పంజాబ్‌కు చెందిన ఓ జంట రోడ్ ట్రిప్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు ఓ చిన్నపాటి కారవాన్‌లో దేశంలో వివిధ ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్ చేస్తు హల్‌చల్ చేస్తున్నారు. ఏకంగా కారవాన్‌లో వంటగదిని ఏర్పాటు చేసుకొని వారి స్వయంగా వండిన ఆహారాన్ని లాగిస్తూ.. వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
జనవరి నెలలో ప్రారంభమైన వారి ప్రయాణం నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రోడ్ ట్రిప్ 52వ రోజులో భాగంగా వారు ఔరంగాబాద్ హైవేపే హాల్ట్ వేశారు. ఈ సందర్బంగా వారు స్వయంగా ఆలూ చావల్‌ను ప్రిపేర్ చేసుకున్నారు. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న చింత చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నామంటూ చేసిన వీడియోను వార ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు.. ‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీకు ఆ దేవుడు మరింత శక్తి ప్రసాదించాలంటూ కామెంట్ చేశారు. మరికొందరు ‘అందరు తల్లిదండ్రులూ చేయవలసింది అదే! జీవితాన్ని ఆస్వాదించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.