- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సహకార సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్
దిశ,నర్సింహులపేట: రైతులు సహకార సంఘాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పేర్కొన్నారు. మంగళవారం నర్సింహులపేట మండల కేంద్రంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎస్.సి.ఏ.బీ చైర్మన్, వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ...రైతులకు సేవలందించడంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పనిచేస్తున్నాయని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ధరలకే ఎరువులు, పనిముట్లు విక్రయం జరుగుతుందని తెలిపారు. కురవి, నర్సింహులపేటలో నూతన బ్యాంకు ఏర్పాటు చేయాలని, టీఎస్.సి.ఏ.బీ చైర్మన్, వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ ను కోరారు.
రైతులకు సేవలందించడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ… రైతులకు సేవలందిచడంలో నర్సింహులపేట పీఏసీఎస్ నిరంతరం పనిచేసే సొసైటీగా జిల్లాలోనే పేరు పొందిందన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలిచ్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ పి ఎస్ ఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి, వైస్ చైర్మన్ బొబ్బ సంజీవరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు పోలేపల్లి రజనీకాంత్ రెడ్డి, ఉపేంద్ర సైదులు, బాలు నాయక్, యాకసాయిలు, వివిధ గ్రామాల సొసైటీ డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, నాయకులు బొబ్బ సోమిరెడ్డి, లింగారెడ్డి,కడుదుల రామకృష్ణ, దస్రు నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.