అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ ఎన్నికను వాయిదా వేయద్దు: మోహబూబా ముఫ్తీ

by Disha Web Desk 17 |
అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ ఎన్నికను వాయిదా వేయద్దు: మోహబూబా ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయవద్దని పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మోహబూబా మఫ్తీ, ఎన్‌సీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా శుక్రవారం ఎన్నికల సంఘాన్ని కోరారు. మూడో దశలో భాగంగా మే 7 న ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య పోలింగ్‌‌ను వాయిదా వేయాలని కొన్ని పార్టీలు, ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా పీడీపీ అధ్యక్షురాలు, ఎన్‌సీ నాయకుడు రీషెడ్యుల్ ప్రతిపాదనను మానుకోవాలని ఎన్నికల అధికారులకు లేఖ రాశారు.

అనంత్‌నాగ్-రాజౌరీ ఎన్నికను వాయిదా వేయడం సరికాదు. పోలింగ్‌కు ఇంకా పది రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఇలా చేయవద్దని ఎలక్షన్ కమిషన్‌కు నా విజ్ఞప్తి. ఇది తప్పుడు సందేశాన్ని పంపినట్లవుతుంది. తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని మోహబూబా ముఫ్తీ అన్నారు. పూంచ్ జిల్లాలో సురన్‌కోట్‌లో విలేఖరులతో మాట్లాడిన ఆమె, కొంతమంది నన్ను పార్లమెంట్‌లో చూడటం ఇష్టం లేకనే వారంత కక్ష గట్టి ఎన్నికలను వాయిదా వేయడానికి, రిగ్గింగ్ చేయడానికి ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని, జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికే ప్రజలు చాలా నష్టపోయారు, ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగడానికి అందరూ సహకరించాలని ఆమె అన్నారు.



Next Story