బీఆర్ఎస్ నాయకులు చేరికను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్ నాయకులు చేరికను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
X

దిశ,తాండూర్ : మండలంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం గందరగోళానికి దారితీసింది. మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించిన అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహేందర్ రావు అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నచ్చే చెప్పినప్పటికీ కాంగ్రెస్ లో వారిని తెచ్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రచార రథానికి అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం పోటా పోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఎమ్మెల్యే వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ టీపీసీసీ, జిల్లా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేరిక నిర్ణయం తీసుకుంటామని కార్యకర్తలకు హామీ ఇచ్చి వెళ్లిపోయారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలను అడ్డుకోవడం సరికాదు...

పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన తమను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు అడ్డుకోవడం సరికాదని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు స్థానిక నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసమే కార్యకర్తలను ఉసిగొల్పి తమను కాంగ్రెస్ పార్టీలో చేరుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో తాము ఎన్నో సంవత్సరాలు పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి, పార్టీకి ఎంతో సేవ చేశామని, పార్టీని బలోపేతం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డామని గుర్తు చేశారు. టిపిసిసి అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఉత్సాహంగా ముందుకు వస్తే కొందరు కావాలని ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఓటమికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అభ్యర్థి విజయం, మండలంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని పార్టీ అధిష్టానం స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed