ఆర్ఆర్ టాక్స్ అంటే కొత్త అర్థం చెప్పిన కేంద్ర మంత్రి.. !

by Disha Web Desk 9 |
ఆర్ఆర్ టాక్స్ అంటే కొత్త అర్థం చెప్పిన కేంద్ర మంత్రి.. !
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు. దేశంలో జీఎస్టీ టాక్స్ అమలులో ఉంటే తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ కూడా అమలులో ఉందని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ టాక్స్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి టాక్స్ అని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.

Next Story

Most Viewed