- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాణ్యత పరీక్షల్లో ఫెయిలైన పతంజలి 'సోన్ పాప్డి'.. అధికారికి జైలు శిక్ష
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలికి చెందిన 'సోన్ పాప్డి' ఆహార ఉత్పత్తుల నాణ్యత పరీక్షలో విఫలమైనందుకు ఆ కంపెనీకి చెందిన లక్సర్‌లోని పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అభిషేక్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు ఉత్తరాఖండ్‌లోని పిథోరఘర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని సెక్షన్ 59 ప్రకారం ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది, అలాగే, అభిషేక్ కుమార్ రూ.25,000, మరో ఇద్దరు.. అజయ్ జోషి రూ.10,000, పాఠక్ రూ.5,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
గతంలో పతంజలి సోన్ పాప్డి నాణ్యత సరిగ్గా ఉండటం లేదని ఫిర్యాదులు అందిన తర్వాత సెప్టెంబర్ 17, 2019న ఒక ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పిథోరఘర్‌లోని ఒక స్వీట్ షాపు నుంచి సోన్ పాప్డి ప్యాకేట్లను తీసుకుని వాటి నమూనాలను రుద్రాపూర్‌లోని టెస్టింగ్ ల్యాబ్‌కు పంపారు. పరీక్ష ఫలితాల్లో వాటి నాణ్యత అంతగా లేదని తేలింది, దీంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. దీనిపై తాజాగా తీర్పును వెలువరించారు. ముగ్గురు నిందితులు కోర్టు వేసిన శిక్షను అనుభవించని పక్షంలో వరుసగా 7 రోజుల నుంచి 6 నెలల వరకు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. ఇప్పటికే తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాల మధ్య పతంజలికి మరో షాక్ తగిలింది.