Pet Rocks: కుక్కలు, పిల్లులను కాదు రాళ్లను పెంచుకుంటున్న సౌత్ కొరియన్స్.. షాకింగ్ స్టోరీ ఇది..

by Sujitha Rachapalli |
Pet Rocks: కుక్కలు, పిల్లులను కాదు రాళ్లను పెంచుకుంటున్న సౌత్ కొరియన్స్.. షాకింగ్ స్టోరీ ఇది..
X

దిశ, ఫీచర్స్: కల్చరల్ పవర్ హౌజ్ గా పిలువబడే సౌత్ కొరియా గ్లోబల్ ట్రెండ్ సెట్టర్ గాను గుర్తింపు పొందింది. కొరియన్ డ్రామాస్, ఫిల్మ్స్, మ్యూజిక్ లోనూ యూనిక్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అలాంటి దేశం తాజాగా మరో వినూత్న పద్ధతితో వైరల్ అయిపోతుంది. నిజానికి ఎమోషనల్ సపోర్ట్ కోసం కుక్కలు, పిల్లులు పెంచుకోవడం కామన్. వాటితో టైం స్పెండ్ చేయడం వల్ల ఈ బిజీ లైఫ్ లో కాస్త ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తారు. అందుకే పెట్ యానిమల్స్ ను పెంచుకుంటారు. కానీ ఇక్కడ వీటికి బదులుగా సరికొత్త సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. పెంపుడు జంతువులకు బదులు పెట్ స్టోన్స్, పెట్ రాక్స్ పెంచుకుంటున్నారు. తద్వారా ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు.


ఈ పెట్ రాక్స్ తో కొద్ది సేపు స్పెండ్ చేస్తే ఒత్తిడి, ఆందోళన దురమైపోతుందని.. చాలెంజింగ్ సిచుయేషన్స్ లో స్టేబుల్ గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయని నమ్ముతారు. రిలాక్స్, రీఫోకస్ సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. పైగా ఈ వీటిని డాగ్స్ మాదిరిగా వాకింగ్ కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తినిపించాల్సిన పని లేదు. వాటికి ఎలాంటి రోగం రాదు. చనిపోయి దూరం అవుతాయనే బాధ లేదు. అందుకే వీటిని పెంచుకునేందుకు ఇష్టపడుతున్న సౌత్ కొరియన్లు.. వాటికి నచ్చిన విధంగా డ్రెస్సులు వేస్తూ, గదిలో ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తూ..మనసులో స్పెషల్ ప్లేస్ ఇస్తూ.. భద్రంగా చూసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed