Johnny Master: కన్నీటితో ఇంట్లో అడుగుపెట్టిన జానీ మాస్టర్.. నెట్టింట్లో ఎమోషనల్ పోస్ట్ (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-26 16:33:46.0  )
Johnny Master: కన్నీటితో ఇంట్లో అడుగుపెట్టిన జానీ మాస్టర్.. నెట్టింట్లో ఎమోషనల్ పోస్ట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి విడుదలైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లారు. కంటినిండా నీటితో ఇంట్లో అడుగుపెట్టిన మాస్టర్‌కు కుటుంబసభ్యులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా భార్య, పిల్లలను గట్టిగా హత్తుకొని జానీ మాస్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా(instagram)లో పోస్టు పెట్టారు. ‘నా కుటుంబం, అభిమానుల ప్రార్థనల వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నా. నిజం అనేది ఏదో ఓ రోజు తప్పక బయటపడుతుంది. నా ఫ్యామిలీ పడిన కష్టం.. ఎప్పటికీ నన్ను వేదనకు గురిచేస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

కాగా, లైంగిక వేధింపులు(Sexual harassment), పోక్సో కేసు(POCSO case)లో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌(Choreographer) జానీబాషా అలియాస్‌ జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌‌కు తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ఆయనకు హైకోర్టు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. దాదాపు 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పోక్సో కేసు కావడంతో ఆయనకు ప్రకటించిన జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.

Johnny Master: మనిషి అనే వాడు జైలుకు పోకూడదు.. నరకంలా ఉంది.. జానీ మాస్టర్ సంచలన కామెంట్స్


Advertisement

Next Story