Kiran Abbavaram: కేవలం తెలుగులో మాత్రమే ‘క’ రిలీజ్.. కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్

by sudharani |
Kiran Abbavaram: కేవలం తెలుగులో మాత్రమే ‘క’ రిలీజ్.. కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రజెంట్ ‘క’ (ka) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా సుజిత్ (Sujeet), సందీప్ (Sandeep) టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్లుగా పరిచయమవుతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకంగా రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ (huge budget)తో రాబోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ (High Expectations) నెలకొన్నాయి. ఈ మూవీ దీపావళి స్పెషల్ (Special)గా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా.. తాజాగా రిలీజ్ (release) చేసిన ట్రైలర్‌కు నెట్టింట విశేష స్పందన లభిస్తుంది. ఈ ఈ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగా కిరణ్ అబ్బరం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

‘మా "క" మూవీ ట్రైలర్ (Trailer) చాలా బాగుందంటూ రెస్పాన్స్ (Response) వస్తోంది. సినిమా రిలీజ్‌కు మరో నాలుగు రోజులే ఉంది. చాలా ఎగ్జైటింగ్ (exciting)గా ఫీల్ అవుతున్నాం. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒకవారం తర్వాత కన్నడ (Kannada), తమిళ (Tamil), మలయాళం (Malayalam)లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే తమిళనాట థియేటర్స్ (Theatres) దొరకలేదు, మలయాళం (Malayalam)లో దుల్కర్ లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సేమ్ డేట్‌కు రిలీజ్ అవుతోంది. కాబట్టి ఒక వారం ఆగి "క" సినిమాను ఆ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాం. తెలుగులో మీరు మంచి సక్సెస్ (success) ఇస్తే ఆ భాషల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed