Former Minister Errabelli : గిరిజనులపై దాడులు చేస్తే సహించం

by Kalyani |   ( Updated:2024-10-26 16:19:02.0  )
Former Minister Errabelli : గిరిజనులపై దాడులు చేస్తే సహించం
X

దిశ, పాలకుర్తి/తొర్రూరు: జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో ఇటీవల పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న లకావత్ శ్రీనివాస్ హత్య సంపూర్ణంగా, ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆధ్వర్యంలో 2000 మంది గిరిజనులతో, మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పాలకుర్తి మండలం మేకల తండా కు చెందిన లకావత్ శ్రీనివాస్ నాయక్ ఇటీవల సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందు తనకు న్యాయం జరుగలేదు అంటూ, తన శరీరం మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల ఒత్తిడి వల్ల తనకు న్యాయం జరగలేదని, స్వయంగా అతను చనిపోయే ముందు చెప్పాడని ఎర్రబెల్లి తెలిపారు.

శ్రీనివాస్ పెట్రోల్ పోసుకోక ముందుకు నాతో ఫోన్ మాట్లాడాడు. పెట్రోల్ పోసుకొని హాస్పిటల్ కి వెళ్ళాక కూడా నాతో ఫోన్ మాట్లాడారనీ, అదే విధంగా నాకు పోలీసుల నుండి ఎటువంటి న్యాయం జరగడం లేదు నాకు నా భార్య కావాలని బోరున నాతో ఫోన్లో విలపించాడనీ తెలిపారు. చనిపోయి ఎన్ని రోజులు అవుతున్న, ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం చాలా దురదృష్టం అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీనివాస్ నాయక్ కుటుంబానికి న్యాయం చేస్తూ, 50 లక్షల రూపాయలు, ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నా కార్యక్రమం లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story