O andala rakshasi: మహిళలు ఎలా మోసపోతున్నారో తెలిపే చిత్రమే ఇది.. హీరో కామెంట్స్

by sudharani |
O andala rakshasi: మహిళలు ఎలా మోసపోతున్నారో తెలిపే చిత్రమే ఇది.. హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: డైరెక్టర్‌గా, హీరోగా, సంగీత దర్శకుడిగా షెరాజ్ మెహదీ (Sheraz Mehdi) తెలుగు (Telugu), తమిళ (Tamil) ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ (present) ఈయన ‘ఓ అందాల రాక్షసి’ (O andala rakshasi) అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్నారు. ఇందులో విహాన్షి హెగ్డే (Vihanshi Hegde), కృతి వర్మ (Kriti Verma)లు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌‌పై రూపొందుతన్న ఈ చిత్నాన్ని సురీందర్ కౌర్ (Surinder Kaur) నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో.. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమా గ్లామర్ బేస్డ్ (Glamour Based) మూవీ కాదు. మంచి కంటెంట్ (content) ఉన్న సినిమా. ఒకరకంగా ఇది ఉమెన్ ఓరియెంటెడ్ (Women Oriented) మూవీ అనుకోవచ్చు. మహిళల గురించిన అంశాలు ఉంటాయి. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం (fraud) చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ ఇంపార్టెంట్ (Important) రోల్స్‌లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్‌లో మిమ్మల్ని కలుస్తాం’ అని తెలిపారు.

Advertisement

Next Story