MP:ఉద్యోగ కల్పనకు కేంద్రం కృషి

by Sridhar Babu |
MP:ఉద్యోగ కల్పనకు కేంద్రం కృషి
X

దిశ, కాప్రా : ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ప్రోత్సహిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender)తెలిపారు. శనివారం చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ , వాసవీ క్లబ్, సుధాకర్ గాండే ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా (Mega job fair)కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరంలో గుడిసెల్లో ఉన్నవారు, కూలి పని చేసుకునే పిల్లలు కూడా చదువుకుంటున్నారని, మగ పిల్లల కంటే ఆడ పిల్లలు ఎక్కువ ఇంటిలిజెంట్ గా ఉన్నారన్నారు. ఎంత మంచిగా చదివించినా ఉద్యోగాలు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, చదివిన చదువుకు సరైన ఉద్యోగం దొరకడం లేదని, నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో పిల్లల ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.

కంపెనీ ఎదుగుదలకు ఉద్యోగుల కమిట్మెంట్, స్కిల్ అవసరం అన్నారు. అందుకు అనుగుణంగా ఉద్యోగస్తులకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకోవాలని సూచించారు. మాలాంటి వారికి పెద్దగా చదువు రాకపోయినా సమాజాన్ని చదువుకున్నట్టు తెలిపారు. మనదేశం యువ సంపద కలిగి ఉందని, చైనా జనాభాతో సమానంగా ఉన్నా అక్కడ ఎక్కువ మంది వృద్దులు ఉన్నారన్నారు. అమెరికాలో పనిచేస్తున్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భారతీయులేనన్నారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిందని, చదువు, మార్కులు మాత్రమే క్రైటీరియా కాదన్నారు.

కాగా కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని సుమారు వందల కంపెనీలు ఉద్యోగులను నియమించుకున్నారు. సుమారు మూడు వందలకుపైగా ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్ లేటర్లను ఎంపీ అందజేశారు. కార్యక్రమంలో చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు డా.కె. గోవిందా రెడ్డి, ఎస్ జీ ఫౌండేషన్ ఫౌండర్ సుధాకర్ ఘండి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బాబ్ మేళ ఇన్ చార్జ్ శ్రీనివాస్, చైర్మన్ రోషి రెడ్డి, కార్యదర్శి చంద్ర శేఖర్, వెంకటేశ్వర రెడ్డి , రాము, శ్రీనివాస్, కిషోర్ కుమార్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story