- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తమిళనాడులోని కన్యాకుమారిలో తీవ్ర విషాదం.. సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు మెడికోలు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచిరాపల్లిలోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు మెడికోలు తమ స్నేహితుడి వివాహ వేడుక నిమిత్తం కన్యాకుమారికి వచ్చారు. అయితే, పెళ్లి ముగియగనే దగ్గరలోని టూరిస్ట్ ప్లేసులను చూసేందుకు వైద్య విద్యార్థులంతా గ్రూపులుగా విడిపోయారు. అందులో ఓ గ్రూపు కన్యాకుమారి తీరంలో మూసి ఉన్న ఓ ప్రైవేటు బీచ్‌కి వెళ్లారు. ఈత కోసం సముద్రంలోకి దిగగా.. అలలు పెద్ద ఎత్తున రావడంతో ఐదుగురు విద్యార్థులు సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందారు. మృతులు చారుకవి, గాయత్రి, సర్వదర్శిత్, ప్రవీణ్ సామ్, వెంకటేష్ ఉన్నారు. అందులో ముగ్గురు మహిళా మెడికోలు నేషి, ప్రీతి ప్రియాంక, శరణ్య ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ప్రస్తుతం వారిని స్థానికులు రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.