బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాలి : హ‌రీష్‌రావు

by Disha Web Desk 11 |
బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాలి : హ‌రీష్‌రావు
X

దిశ, ములుగు :- అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి, కాంగ్రెస్‌ల‌కు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా వర్గల్ మండలం,ములుగు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ లను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఢిల్లీలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. బిజెపి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధించిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు హామీల అమలను పూర్తిగా మరిచి ప్రజల గుండెల మీద తంతుందన్నారు. వడ్లు నేడు కల్లాలకు వచ్చిన ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ దేనని అన్నారు. ఉద్యమాల ప్రగతిగడ్డ మెదక్ స్థానంపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రశ్నించిన కేసీఆర్ కండ్లు పీకేస్తా, పేగులు మెడలో వేసుకుంటా, చెడ్డి గుంజుతా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం అంటే మనల్ని అవమాన పరిచినట్లు కదా అని, ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలన్నారు.

రాదు అనుకున్న తెలంగాణ ను ప్రాణాలకు తెగించి సాధించిన కేసీఆర్ ను మనం కాపాడుకోవలన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎడ్లు, నాగలి, నిరుద్యోగ భృతి, పింఛన్లు ఇస్తామని మోసం చేసిన రఘునందన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. మరోసారి బిజెపి అభ్యర్థి రఘువరన్ధన్ రావుకు మరోసారి ఎంపీ ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నాడు, మన తడాఖా చూపెట్టాలన్నారు. మనం నిర్మించుకున్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్ళు విడుదల చేసుకోవడానికి ధర్నాలు చేయాల్సి వచ్చిందన్నారు. నీటిని రైతులకు అందజేస్తే పంటలు మంచిగా పండించుకునే వారన్నారు.

కాంగ్రెస్ నాయకులు నోరు తెలిస్తే సిగ్గులేకుండా దొంగమాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళలకు 2,500 ఇస్తున్నాం అని అంటున్నారని, నిద్రలో మాట్లాడుతున్నారా అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కరెంట్ కోతలు,నీళ్ల సమస్యలు మొదలయ్యాయని అన్నారు. దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని అన్నారు. కేసీఆర్ వదిలిన బాణం మన వెంకట్రామిరెడ్డి అని అలాంటి వ్యక్తి ని గెలిపించి పార్లమెంట్ కు పంపితే ఉపయోగం ఉంటదన్నారు.

కుటుంబ సాక్షిగా ప్రమాణం : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి

11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో సేవ చేసే భాగ్యం కలిగింది. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామ రెడ్డి అన్నారు. తాను ఎంపీ గా గెలిచిన వెంటనే నియోజకవర్గానికి ఒక రూపాయికే ఒక ఫంక్షన్ హాల్, విద్యార్థుల కోసం 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని కుటుంబ సాక్షి గా ప్రమాణం చేశారు. గ్రామాలలో ఫంక్షన్ హల్ నిర్మించి ఒక్క రూపాయి కే పెళ్లిచేసుకోవచ్చు, ప్రతి నిరుద్యోగ విద్యార్థులకు ప్రైవేట్ పరిశ్రమల్లో ఉద్యోగం వచ్చేలా చూస్తాను. ప్రజా సేవ చేసి చనిపోతాను మీ సేవ చేసేందుకు కలెక్టర్ ఉద్యోగం వదులుకున్నాను నన్ను జీవించండి ముంపు బాధితులకు న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ జహంగీర్, ఎంపీపీ లావణ్య అంజన్న గౌడ్, జెడ్పిటిసి జయమ్మ అర్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు జుబెర్ పాషా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కొన్యాల బాల్ రెడ్డి, గణేష్ గుప్తా, లింగారెడ్డి, హరిబాబు, ప్రవీణ్, వర్గల్ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed