- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ
దిశ, సినిమా: డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణవంశీ నిర్మించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, రాఖీ, చందమామ, మహాత్మ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. కృష్ణవంశీ లవ్ స్టోరీస్, అందమైన కుటుంబ చిత్రాలు, ధైవభక్తి కథలతో సహా అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు, కానీ అతను ఇప్పుడు అసలు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కొద్ది రోజుల క్రితం “రంగమార్తాండ” చిత్రంతో మరోసారి అందర్ని ఆకట్టుకునే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
మే 20న సిరివెన్నెల జయంతి సందర్భంగా ఈ వేడుకను నిర్వహించగా.. సినీ నటులు, గాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకకు దర్శకుడు కృష్ణవంశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. సిరివెన్నెలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ “సిరివెన్నెల శాస్త్రి గారు నాకు 1989 నుంచి తెలుసు.. ఆయన దొరకడం నా అదృష్టం. నన్ను కొడుకుగా భావించి చాలా ప్రేమగా చూసుకున్నారు. వారి ఇంట్లోనే చాలా రోజులు ఉన్నాను. ఆయన చాలా ధైర్యంగా ఉంటాడు. ఆరు నెలల్లో సినిమాను ప్రారంభించాలనుకుంటున్నాను. పాటలకు ఏం చేయాలో తెలియడం లేదు. కథ ఇది అనుకుని ఆయన దగ్గరకు వెళ్లేవాడిని. ఇప్పుడు ఆయన లేరు .. ఒక విధంగా, నేను సినీ పరిశ్రమలో అనాథను అయ్యాను.. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదంటూ.. " కన్నీళ్లు పెట్టుకున్నారు.