- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదరంగంలో చిచ్చర పిడుగు.. మూడేళ్ల వయసులోనే అనీశ్ సంచలనం
దిశ, స్పోర్ట్స్ : సాధారణంగా మూడేళ్ల వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. కార్టూన్లు చూస్తుంటారు. కానీ, అనీశ్ సర్కారు అందుకు భిన్నం. ఈ కోల్‌కతా చిచ్చర పిడుగు చదరంగంలో సంచలనం సృష్టించాడు. యంగెస్ట్ ఫైడ్ రేటెడ్ ప్లేయర్‌గా నిలిచాడు. తాజాగా జరిగిన వెస్ట్ బెంగాల్ స్టేట్ అండర్-9 ఓపెన్ టోర్నీలో పాల్గొనడంతో అతను ఈ ఘనత సాధించాడు.
అనీశ్ 2021 జనవరి 26న జన్మించాడు. మూడు సంవత్సరాలు, 8 నెలల, 19 రోజుల వయసు ఉన్న అనీశ్ ఆ టోర్నీలో 8 పాయింట్లకు 5.5 పాయింట్లు సాధించి 24వ స్థానంలో నిలిచాడు. దీంతో అనీశ్ 1555 ఫైడ్ రేటింగ్ పొందాడు. ఇంతకుముందు యంగెస్ట్ ఫైడ్ రేటెడ్ ప్లేయర్ రికార్డు తేజాస్ తివారి పేరిట ఉండేది. తేజాస్ ఐదేళ్ల వయసులో ఈ ఘనత సాధించగా.. తాజాగా మూడేళ్ల అనీష్ ఆ రికార్డు అధిగమించి కొత్త చరిత్రను లిఖించాడు.
వెస్ట్ బెంగాల్ స్టేట్ అండర్-13 ఓపెన్ టోర్నీలోనూ అనీశ్ పాల్గొంటాడు. అంతకుముందు మరోసారి నైపుణ్యాలు పరీక్షిస్తారు. ఆ టోర్నీలో అనీశ్ అనుభజ్ఞులను ఎదుర్కోనున్నాడు.దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అనీశ్ ఏడాది క్రితం చదరంగం ఆడటం మొదలుపెట్టాడు.
మూడేళ్లలోనే అనీశ్ చెస్‌పై మక్కువ పెంచుకున్నాడంటే తల్లిదండ్రులు చెస్ ప్లేయర్ల అయి ఉంటారని అనుకుంటాం. కానీ అనీశ్ తల్లిదండ్రులకు చదరంగంపై అవగాహన లేదు. ఈ విషయాన్ని అనీశ్ తల్లి స్వయంగా తెలిపింది. ‘నాకు ఒక్క చెస్ కదలిక గురించి కూడా తెలియదు. అనీశ్ తండ్రికు కొంచెం తెలుసు. కానీ, ఒక్కసారి కూడా ఆయన అనీశ్‌ను ఓడించలేదు.’ అని తెలిపింది. అలాగే, అందరిలాగే తాము కూడా అనీశ్‌కు కార్టూన్స్ చూపించామని, కానీ, అతను చెస్ వీడియోలు మాత్రమే చూసేవాడని చెప్పింది. చెస్ వీడియోలను చివరి వరకూ చూసేవాడని, అందుకే చెస్ బోర్డు కొనిచ్చానని చెప్పుకొచ్చింది. యూట్యూబ్‌లో గోథమ్ చెస్ చూడటానికి చాలా ఇష్టపడతాడని, కానీ, అనీశ్‌కు మాగ్నస్ కార్ల్‌సన్ రియల్ హీరో అని తెలిపింది.