Spousal Privacy Right: జీవితభాగస్వాములకూ గోప్యత హక్కు

by Mahesh Kanagandla |
Spousal Privacy Right: జీవితభాగస్వాములకూ గోప్యత హక్కు
X

దిశ, నేషనల్ బ్యూరో: గోప్యత(Privacy Right) అనేది ప్రాథమిక హక్కు(Fundamental Right) అని, అందులో జీవిత భాగస్వామిక గోప్యత(Spousal Privacy) కూడా ఉంటుందని మద్రాస్ హైకోర్టు(Madras High Court) తెలిపింది. ఓ డైవర్స్ కేసులో భర్త తనను తానే సాక్షిగా పేర్కొంటూ భార్య కాల్ డేటా రికార్డులను ఎవిడెన్స్‌గా కోర్టులో చూపాడు. స్థానిక కోర్టు ఇందుకు అనుమతించడాన్ని తప్పుబడుతూ భార్య హైకోర్టును ఆశ్రయించారు. జీవితభాగస్వామిక గోప్యతను గౌరవించాలని, ఒకరిపై మరొకరు నిఘా వేయడం సరికాదనిజస్టిస్ జీఆర్ స్వామినాథన్ అక్టోబర్ 30వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. అలా నిఘా వేయడాన్ని కోర్టు ప్రోత్సహించదని తెలిపారు. భార్యకు తెలియకుండా ఆమె వివరాలను సేకరించడాన్ని తప్పుపట్టారు. తన భార్య కాల్ డేటాను వెబ్ సైట్ ద్వారా తీసుకుని ఆమెకు వ్యతిరేకంగా భర్త ఆ కోర్టులో ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కాల్ డేటా సేకరణ కూడా చట్టబద్ధంగా సాగలేదని, సదరు నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు అధికారికంగా దరఖాస్తు పెట్టుకుని కాల్ డేటా తీసుకోలేదని వివరించారు. భాగస్వామిక గోప్యతను భంగపరుస్తూ సేకరించిన ఆధారాలను కోర్టులో అనుమతించబోమని స్పష్టం చేస్తూ స్థానిక కోర్టు నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.

Advertisement

Next Story

Most Viewed