Poll Promises: మోసం, అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ: ఖర్గే

by Mahesh Kanagandla |
Poll Promises: మోసం, అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ: ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉచిత హామీలపై కామెంట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. మోడీ ప్రభుత్వాన్ని వర్ణించడానికి అబద్ధాలు, మోసం, నటన, దోపిడీ, ప్రచారం అనే పదాలు సరిగ్గా సరిపోతాయని పేర్కొన్నారు. ఎన్డీయే 100 రోజుల ప్లాన్.. ఒక పీఆర్ స్టంట్ అని విమర్శించారు. 2047 వికసిత్ భారత్‌కు రోడ్ మ్యాప్ కోసం లక్షల మంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు 2024 మే 16న ప్రధాని చెప్పారని, కానీ, పీఎంవో వాటి వివరాలు ఇవ్వడానికి నిరాకరించిందని, ఆయన అబద్ధాలు బట్టబయలు చేయడానికి ఇది చాలు అని పేర్కొన్నారు. ప్రతి యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, నిత్యావసర ధరలపై నియంత్రణ, అచ్చే దిన్, వికసిత్ భారత్ లక్ష్యం, అవినీతి అంతం, సబ్ కా సాత్, సబ్ కా వికాస్, జై జవాన్-జై కిసాన్ అంటూ కేంద్రం ఇచ్చిన నినాదాలు ఎందుకు వాస్తవరూపం దాల్చలేవని ప్రశ్నించారు. ఏడు హామీలను ఎక్స్ వేదికగా వరుసగా ప్రశ్నిస్తూ ప్రధాని మోడీపై ఎదురుదాడికి దిగారు.

Next Story

Most Viewed