- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raihan Vadra : సోనియా ఇంటికి పెయింటింగ్ వేసిన రైహాన్, రాహుల్
దిశ, నేషనల్ బ్యూరో : ప్రియాంకాగాంధీ కుమారుడు 24 ఏళ్ల రైహాన్ వాద్రా(Raihan Vadra) బిజీబిజీగా ఉన్నాడు. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో ఉన్న తన అమ్మమ్మ సోనియాగాంధీ నివాసంలోని గోడలకు అతడు స్వయంగా పెయింటింగ్స్ వేస్తున్నాడు. తన మేనమామ రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో కలిసి ఈ పనులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన తొమ్మిది నిమిషాల వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాహుల్, రైహాన్ కలిసి మట్టి ప్రమిదలను చూస్తూ.. వాటిని తయారు చేసే కుటుంబంతో ముచ్చటిస్తుండటం ఆ వీడియో చివర్లో కనిపించింది. ఆ మట్టి ప్రమిదలను తన తల్లి, సోదరికి ఇస్తానని రాహుల్ చెప్పడం అందులో రికార్డయింది.
భారత్‌ను వెలుగులతో నింపుతున్న భవన నిర్మాణ కార్మికులతో దీపావళి సందర్భంగా కలిసి పనిచేయడం అనేది చాలా గొప్ప అనుభవమని ఆ పోస్ట్‌లో రాహుల్ రాసుకొచ్చారు. దీనివల్ల వారి సమస్యలు, సవాళ్లను తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. అత్యంత సమీపం నుంచి కార్మికుల పనిని పరిశీలించి, దానికి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇదొక మంచి అవకాశమని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘ఆ కార్మికులు దీపావళి పండుగ వచ్చినా ఇళ్లకు వెళ్లరు. కొన్ని డబ్బులు సంపాదించడం కోసం వాళ్లు తమ ఊరిని, పట్టణాన్ని, కుటుంబాన్ని మర్చిపోయారు’’ అని కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యానించారు. అవలీలగా ఇళ్లను నిర్మించి ఇస్తున్న కార్మికులు.. అతి కష్టంగా తమతమ ఇళ్లను నడుపుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన నైపుణ్యం ఆధారంగా ప్రతిఒక్కరూ కార్మికులను తప్పకుండా గౌరవించాలని పిలుపునిచ్చారు.