Chinese Soldiers : చైనా సైనికులతో కేంద్ర మంత్రి రిజిజు చిట్‌చాట్

by Hajipasha |
Chinese Soldiers : చైనా సైనికులతో కేంద్ర మంత్రి రిజిజు చిట్‌చాట్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్, చైనా సైనిక దళాలు తూర్పు లడఖ్‌ పరిధిలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నాలుగేళ్ల తర్వాత మళ్లీ గస్తీని ప్రారంభించాయి. డెస్పాంగ్, డెంచాక్‌ పరిధిలోని ఏరియాల్లో ఇరుదేశాల సైనికుల పెట్రోలింగ్ మొదలైంది. సైనిక ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో.. 2020 మే నెలకు మునుపటి పొజిషనింగ్‌కు భారత్, చైనా సైనిక దళాలు చేరుకున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్‌(Arunachal Pradesh)లోని తవాంగ్ సరిహద్దు సమీపంలో ఉన్న చెక్ పాయింట్ వద్ద ముగ్గురు చైనా సైనికుల(Chinese Soldiers)తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) సంభాషించారు.

‘‘మీరు సముద్ర మట్టానికి 15వేల అడుగుల ఎత్తున్న ఏరియాలో విధులు నిర్వహిస్తున్నారు కదా.. దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు’’ అని కిరణ్ రిజిజు అడిగారు. దీనికి చైనా సైనికులు బదులిస్తూ.. ‘‘అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేం చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాం’’ అని చెప్పారు. ఈ సంభాషణకు సంబంధించిన ఒక వీడియోను కిరణ్ రిజిజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Next Story