మొటిమలతో బ్రెయిన్ ఇన్ఫెక్షన్.. అక్కడ వస్తే మాత్రం గిల్లకండి..

by Sujitha Rachapalli |
మొటిమలతో బ్రెయిన్ ఇన్ఫెక్షన్.. అక్కడ వస్తే మాత్రం గిల్లకండి..
X

దిశ, ఫీచర్స్: ముఖం మీద మొటిమలు రావడం కామన్. అయితే కొందరు ఇంటి చిట్కాలతో వాటికి బై బై చెప్పేస్తే.. కొందరు మాత్రం వాటిపై యుద్ధమే ప్రకటిస్తారు. పింపుల్ ను గిచ్చి గిచ్చి వదిలేస్తారు. అయితే ఫేస్ మీద ఏ ప్లేస్ లో ఇలా చేసినా పర్లేదు కానీ ' ద డేంజర్ ట్రైయాంగిల్' లో మాత్రం అలా చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒకవేళ చేస్తే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.

డేంజరస్ ట్రైయాంగిల్ అనేది ముక్కు వంతెన నుంచి నోటి మూలల వరకు విస్తరించి ఉన్న త్రిభుజాకార ప్రాంతం. ఈ ప్రాంతంలో చర్మం కింద ఉన్న సిరలు మెదడుకు డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉంటాయి. ఈ ఏరియాలో మొటిమలు అయినప్పుడు వాటిని చిదిమేస్తే.. అక్కడ పేరుకుపోయిన బ్యాక్టీరియా రక్తనాళాల్లోకి ఈజీగా చేరిపోతుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపించి మెదడుపై ప్రభావం చూపుతాయి. అందుకే నిపుణులు ఇలా మొటిమలను స్క్విజ్ చేయకూడదని.. యాంటీబ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed